Reading Time: 2 minutes
Arjun Tendulkar Pre Wedding Celebrations In Jamnagar Ambani Family Joins

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న గ్రాండ్‌గా ముంబైలో జరగనుంది. అయితే పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటను, సచిన్ టెండూల్కర్ కుటుంబానికి ముఖేష్ అంబానీ కుటుంబం జామ్ నగర్‌కు ఆహ్వానించింది. ఇక్కడ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మనసు విప్పి తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి ప్రస్తావన విషయాలను పంచుకున్నారు. తన కుమారుడు అర్జున్.. సానియాను తన దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశాడని.. దీంతో తన కొడుకు పెద్దవాడయ్యాడని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు అర్థమైంది.. ఇద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారని తెలిసిందన్నారు. ‘‘అర్జున్.. నువ్వు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావో.. నిన్ను అంతగా ప్రేమించే ప్రత్యేకమైన వ్యక్తిని కనుగొన్నందుకు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పాలని ఉంది.’’ అని సచిన్ అన్నారు

మార్చి 5న ముంబైలో జరిగే కుమారుడి పెళ్లి కార్డులను సినీ, రాజకీయ ప్రముఖులకు పంచారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆహ్వానించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)