
బ్రిస్బేన్: మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 48.3 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ముందు 215 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. స్మృతి మంధానా, హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బ్యాట్స్ మెన్లలో మంధానా 58. హర్మన్ ప్రీత్ కౌర్ 53, కాశవ్ గౌతమ్ 43, రిచా ఘోష్ 23, మిగిలిన బ్యాట్స్ మెన్లు స్వల్పస్కోర్ కే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలోఅస్లీగ్ గార్డ్నర్ మూడు వికెట్లు, మెగన్ స్కట్ రెండు వికెట్లు, అలానా కింగ్, తాహ్మి, సోపీ మోలీనక్స్ చెలరో మూడు వికెట్లు తీశారు.