
హైదరాబాద్: సూపర్-8లో దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 76 పరుగులతేడాతో ఓటమిని చవి చూసింది. దీంతో భారత జట్టు రన్ రేటు ఘోరంగా పడిపోయింది. మరో వైపు జింబాబ్వే పై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో గెలవడంతో రన్ రేటు ఆమాంతం పెరిగిపోయింది. సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ చేరుకుంటాయి. టీమిండియా జింబాబ్వే, విండీస్ పై గెలిచిన కూడా రన్ రేటు తక్కువగా ఉండడంతో భారత జట్టు ఇంటికి వెళ్లిపోతుంది. ఈ సందర్భంగా జింబాబ్వే, విండీస్ జట్లపై భారీ తెడాతో గెలిస్తేనే సెమీ ఫైనల్ చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ రావాలని సూచించాడు. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ తో తొలుత బ్యాటింగ్ రావడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా అక్షర్ పటేల్ కు జట్టులోకి రావాలన్నారు. అక్షర పటేల్ తన బౌలింగ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇబ్బందులుకు గురిచేస్తాడన్నారు. అక్షర బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉందని పఠాన్ తెలియజేశారు. సంజు శాంసన్, కుల్ దీప్ యాదవ్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి కానీ పెద్ద మొత్తంలో మార్పులు చేయకూడదని సలహా ఇచ్చారు. పెద్దగా మార్పులు చేయకుండా అక్షర్ ను తీసుకుంటే సరిపోతుందన్నారు.