
- మేడే ఉత్సవాల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు
హైదరాబాద్, వెలుగు: విభజన రాజకీయాలు చేస్తున్న శక్తులను కార్మిక లోకం తిప్పికొట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
యుద్ధం ఆగకపోతే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇరాన్‌కు అండగా నిలిచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని టూరిజం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్‌యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి అరుణ పథకాన్ని ఎగురవేశారు.