July 15, 2026

ఔటర్పై 24 గంటల్లోనే మరో ప్రమాదం.. కారులో నలుగురు ప్రయాణీకులు

ఔటర్పై 24 గంటల్లోనే మరో ప్రమాదం.. కారులో నలుగురు ప్రయాణీకులు
Reading Time: < 1 minute

ఔటర్పై 24 గంటల్లోనే మరో ప్రమాదం.. కారులో నలుగురు ప్రయాణీకులు

Caption of Image.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై మరో ప్రమాదం జరిగింది.  కారు ప్రమాదంలో 6 మంది చనిపోయిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మరో కారు బోల్తా పడింది. 2026 మే 02వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్-14 దగ్గర కారు కారు బోల్తా పడింది. 

వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో  నలుగురు ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నందిగామ నుంచి కన్హా శాంతివనం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఎగ్జిట్ 14 దగ్గర కారు బోల్తా పడటంతో ఇతర వాహనాల ప్రయాణీకులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్,  ORR సిబ్బందిని అలర్ట్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న చేరుకుని పరిశీలించారు పహాడీ షరీఫ్ పోలీసులు. అంబులెన్స్, ఓఆర్ఆర్ సిబ్బంది గాయపడిన ప్రథమ చికిత్స అందించి  ఆసుపత్రికి తరలించారు.

©️ VIL Media Pvt Ltd.