Reading Time: 2 minutes

మా ఆవిడను తీసుకొచ్చా జరగండి..మీరంతా ఏంటి ఇక్కడ?.. బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో వైరల్!

Caption of Image.

టాలీవుడ్ యంగ్  హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియురాలు కావ్యా రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల వేదికగా, శ్రీవారి సాక్షిగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

పేర్లు చెప్పే’ ముచ్చట వైరల్!

పెళ్లి తర్వాత తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్న ఈ జంట నేరుగా హైదరాబాద్‌లోని తమ నివాసానికి చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించే ముందు దంపతులిద్దరూ పేర్లు చెప్పే పద్దతి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంట్లోకి ప్రవేశిస్తున్న సయమంలో కావ్యా రెడ్డి ఎంతో మురిపెంగా.. “నేను కావ్య బెల్లంకొండ.. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో కలిసి మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను” అని చెప్పి అందరినీ ఆకట్టుకుంది.

ఇక శ్రీనివాస్ వంతు వచ్చేసరికి సరదా సన్నివేశం చోటుచేసుకుంది. “మా ఇంటికి మా ఆవిడను తీసుకొచ్చాను.. మీరంతా ఏంటి? జరగండి” అని నవ్వించేశాడు. కుటుంబ సభ్యులు, కావ్య పట్టుబట్టడంతో చివరకు తనదైన స్టైల్‌లో.. “నా భార్య కావ్య బెల్లంకొండతో ఇంటికి వచ్చా.. నా పేరు అల్లుడు శీను” అని తన మొదటి సినిమా పేరును గుర్తు చేస్తూ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

శ్రీవారి సన్నిధిలో మూడు ముళ్లు

ఏప్రిల్ 29, బుధవారం రాత్రి 11:05 గంటలకు శుభ ముహూర్తాన వేద మంత్రోచ్చారణల మధ్య కావ్యా రెడ్డి మెడలో శ్రీనివాస్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చెందిన కావ్య రెడ్డి, శ్రీనివాస్ గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఇప్పుడు ఒకటయ్యారు. ఈ వివాహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వంటి ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హైదరాబాద్ లో రిసెప్షన్

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్, ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలో ఈ జంట ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో మెరవనున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ క్రేజీ కపుల్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.