Reading Time: < 1 minute

అలర్ట్..ఏపీలో మరో ఐదు రోజులు వర్షాలు..

Caption of Image.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు.

ముఖ్యంగా ఉత్తర కోస్తా,  దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని  తెలిపారు.  సముద్రం అలజడిగా ఉంటుందని, కావున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత ప్రజలను కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.