Reading Time: < 1 minute

ఉద్యోగాల పేరుతో రూ.8 లక్షలు కుచ్చుటోపీ

Caption of Image.

మేడిపల్లి, వెలుగు: ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి రూ.8 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్​కు చెందిన యశ్వంత్​రెడ్డి 2025 ఆగస్టులో లింక్డ్‌‌‌‌‌‌‌‌ఇన్ ద్వారా అమీన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వినయ్ రెడ్డి, అతని బంధువు రిషితా రెడ్డిని పరిచయం చేసుకున్నాడు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని వారిని నమ్మించాడు. మొదట రూ.7.10 లక్షలు నగదుగా తీసుకుని, మిగిలిన రూ.70 వేలు యూపీఐ ద్వారా తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. 

రోజుకు కొద్ది గంటలపాటు శిక్షణ ఇస్తానని చెప్పాడు. ఒక నెల జీతం కూడా చెల్లించాడు. తర్వాత ఫోన్ కాల్స్, మెసేజ్‌‌‌‌‌‌‌‌లకు స్పందించడం మానేసి వారిని బ్లాక్ చేసి పరారయ్యాడు. ఈ వ్యవహారంలో శ్రీనిధి అనే మహిళ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌గా పరిచయం చేసుకుని మోసానికి సహకరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.