Reading Time: < 1 minute

కేసీఆర్‌‌ అవినీతిని ఆయన బిడ్డే ప్రశ్నిస్తోంది.. నియోజకవర్గం అభివృద్ది కోసమే కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నా

Caption of Image.
  •     సమాధానం చెప్పలేక  ఆ కుటుంబం నీళ్లు నములుతోంది
  •     స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

​స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌, వెలుగు : ‘కేసీఆర్ బిడ్డే ఆయన అవినీతిని ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక ఆ కుటుంబం నీళ్లు నములుతోంది’ అని స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ మండలం మీదికొండ గ్రామంలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు.

గత ఎమ్మెల్యే తన చిల్లర చేష్టలు, అవినీతితో ప్రజలను తలదించుకునేలా చేశారన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా ? అని ప్రశ్నించారు. బీఆర్‌‌ఎస్‌‌ నుంచి కవిత ఎందుకు బయటకు వెళ్లిందో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టి రాష్ట్రాన్ని ఆగంచేసిందని ఆరోపించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌ సంపత్‌‌కుమార్‌‌, మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ లావణ్య శిరీశ్‌‌రెడ్డి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.