Reading Time: 2 minutes

నా పెళ్ళాం నిప్పురా! సినిమా డైలాగ్‌తో భార్యను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్!

Caption of Image.

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. కొత్త జీవితానికి స్వాగతం పలికారు. గత కొంతకాలంగా సాగుతున్న ప్రేమాయణాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. ఏప్రిల్ 29న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

వైరల్ అవుతున్నపోస్ట్!

పెళ్లి తర్వాత తన అర్ధాంగిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన తీరు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘జయ జానకి నాయక’లోని ఫేమస్ డైలాగ్‌ను వాడుతూ.. “నేను నిర్మించుకున్న సామ్రాజ్యం మధ్యలో, అంతకంటే గొప్పదైన ఒక నిధిని కనుగొన్నాను. ప్రపంచమా.. ఈమె నా భార్య కావ్య బెల్లంకొండ. నా పెళ్ళాం నిప్పురా!” అంటూ తనదైన మాస్ స్టైల్‌లో భార్యపై ఉన్న ప్రేమని చాటుకున్నారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు అన్న డైలాగ్ టైమింగ్ అదిరింది అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

 

ఘనంగా రిసెప్షన్..

వివాహం అనంతరం మే 1న హైదరాబాద్‌లో నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగింది. ఈ వేడుకకు టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విచ్చేశారు.  వీరితో పాటు నాగ చైతన్య, కాజల్ అగర్వాల్, గోపీచంద్, శ్రీకాంత్ వంటి స్టార్స్ హాజరై కొత్త జంటను విష్ చేశారు. ఈ రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

కెరీర్ జోరు..

పెళ్లి సందడి ముగియగానే శ్రీనివాస్ మళ్లీ తన సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘టైసన్ నాయుడు’  ‘హైందవ’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. తన జీవితంలోకి లక్కీ చార్మ్ లాంటి భార్య రావడంతో, ఇకపై బాక్సాఫీస్ వద్ద తన విజయాల జోరు మరింత పెరుగుతుందని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నూతన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

 

©️ VIL Media Pvt Ltd.