
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ చిత్రంతో నానికి మంచి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్‌కి అద్భుతమైన రెన్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘‘ఆయా షేర్’’ అంటూ సాగే పాట ప్రోమోని విడుల చేశారు. పాట ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటని ఫిబ్రవరి 24ప విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాక సంగీతం అందిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.