Reading Time: < 1 minute

 ఎపి అసెంబ్లీ: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ లోనే డిఎస్సి పోస్టులు ఇతర రాష్ట్రాల్లో కెజిబివి అడ్మిషన్లు జరగడం లేదని అన్నారు. శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉందని, ఉన్నత విద్యలో ఇంజినీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటిఐ కూడా కీలకమని తెలియజేశారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా..వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతామని దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని అన్నారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు అని.. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని సూచించారు. దేవుడిని కూడా వైసిపి రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమని లోకేష్ విమర్శించారు.