
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్’. ఇటీవల విడుదల చేసిన సేతుపతి ఫస్ట్ లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న దునియా విజయ్ లుక్‌ను రివీల్ చేశారు. మంగళవారం ఆయన బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో దునియా విజయ్ పోషిస్తున్న పాత్ర సహజత్వానికి, వాస్తవికతకు దగ్గరగా ఉంటూ ఉత్కంఠభరితంగా ఉంటుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.