Reading Time: < 1 minute
Srh Vs Csk Ipl 2026 Match 27 Playing Xi Toss Ms Dhoni Injury Update

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హోరాహోరీ పోరు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా తమ విజయాల జోరును కొనసాగించేందుకు కీలక మార్పులతో బరిలోకి దిగాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఈసారి ఎంఎస్ ధోనీ తుది జట్టులో లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ధోనీ స్థానంలో సంజూ శామ్సన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే, బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్‌కు బదులుగా ముకేష్ చౌదరిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ జట్టులోకి పేసర్ దిల్షాన్ మదుశంక రాగా.. చెన్నై యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌కు అవకాశం ఇచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుతంగా రాణించిన యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా భారీ స్కోరుపై కన్నేశారు.

తుది జట్లు (Playing XI):
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా (కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్, ఈషన్ మలింగ.

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శామ్సన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, గుర్జాపనీత్ సింగ్. (ఇంపాక్ట్ ప్లేయర్: ముకేష్ చౌదరి).

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ 6వ స్థానంలో ఉండగా.. సీఎస్కే 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకం కానుంది.