
SRH vs CSK: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఇక దద్దరిల్లనుంది. టోర్నీలో నిలకడ కోసం పోరాడుతున్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి తమ పట్టును బిగించాలని చూస్తున్నాయి. ఇక, గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ను మట్టి కరిపించిన కాటేరమ్మ కొడుకులు ఫుల్ ఆకలితో ఉన్నారు. మరవైపు.. సీఎస్‌కే సైతం ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది.
READ MORE: Anil Ravipudi: అనిల్ రావిపూడి మేనియా.. సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనం
ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్, అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ, గత మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు, ముఖ్యంగా టాప్ ఆర్డర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే తన మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టిన తీరు జట్టులో కొత్త ఆశలు రేపింది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు విజయాలతో మళ్ళీ రిథమ్‌లోకి వచ్చింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నా, సంజు శామ్సన్, ఆయుష్ మ్హత్రే టాప్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తూ జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మధ్య ఓవర్లలో సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే వంటి బిగ్ హిట్టర్లు చెన్నైకి బలాన్ని ఇస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇక ఇరు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డుల పరంగా చూస్తే, రెండు టీమ్‌లు తలపడిన 22 మ్యాచ్‌ల్లో చెన్నై 15 సార్లు గెలిచి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది (హైదరాబాద్ 7 సార్లు గెలిచింది). అయితే, తమ సొంత గడ్డపై హైదరాబాద్‌కు మంచి రికార్డు ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గణంకాల పరంగా చెన్నైకి స్వల్ప అవకాశం ఉన్నప్పటికీ, ఉప్పల్ స్టేడియం సన్‌రైజర్స్‌కు ఒక కోట లాంటిది.
అంచనా వేసిన తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఈషన్ మలింగ.
(ఇంపాక్ట్ ప్లేయర్: ప్రఫుల్ హింగే)
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శామ్సన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్.