Reading Time: < 1 minute
Pawan Kalyan Undergoes Surgery Health Update April 2026

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి ఆపరేషన్ జరిగిందని ఎంఎల్సీ పి.హరిప్రసాద్, డిప్యూటీ సీఎంఓ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదలైంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కి ఈ రోజు సాయంత్రం శస్త్రచికిత్స జరిగిందని నోట్‌లో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారని స్పష్టం చేశారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారని తెలిపారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు చెప్పినట్లు వివరించారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నారు.

READ MORE: AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..