Reading Time: < 1 minute
Ishan Kishan Reaction Srh Win Vs Csk Young Bowlers Ipl 2026

Ishan Kishan: నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చెన్నై విజయానికి 60 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై చేతిలో 7 వికెట్లున్నాయి. అందరూ దాదాపు గెలుపు ఖాయమనుకున్నారు. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతమే చేసింది. పిచ్, పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న ఆ జట్టు బౌలర్లు స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. బంతి బంతికి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ చెన్నై చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఎట్టకేలకు విజయం సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని కిషన్ తెలిపాడు.

READ MORE: Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!

ఈ విజయం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. తమ టీమ్‌లోకి యంగ్ బౌలర్లు అదరగొట్టారని ప్రశంసించాడు. యువ బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తుంటే కెప్టెన్‌‌కు కలిగే అనుభూతే వేరని చెప్పాడు. తమ టీమ్‌లోని యువ బౌలర్లు స్వయంగా తమ సొంత ప్లాన్స్‌తో వస్తున్నారని.. అద్భుత ప్రణాళికలతోనే బౌలింగ్ చేస్తున్నారని స్పష్టం చేశాడు. దీంతో తనకు ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. బౌలర్లు ప్రత్యర్థుల కంటే ముందే ఉన్నారు. ఈరోజు వాళ్లు వేసిన బౌలింగ్ తీరు మెచ్చుకోదగినదన్నాడు. తాము సాధారణంగా 30 నుంచి 40 పరుగులు తక్కువ చేశామన్నాడు. “అభిషేక్ త్వరగానే అవుట్ అయ్యాడు. అప్పటికే 60కి పైగా పరుగులు ఉన్నాయి. వాస్తవానికి మా టీమ్ 220, 230 పరుగులు చేసినప్పుడు మా స్టార్ బ్యాటర్లలో ఎవరో ఒకరు అత్యధిక పరుగులు చేస్తారు. కానీ.. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఆ భారీ ఇన్నింగ్స్ మిస్ అయ్యింది. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ.. 30-40 పరుగుల తక్కుగానే చేశాం. మా యువ బౌలర్లు ప్రాక్టీస్ సెషన్‌లో చాలా కష్టపడుతున్నారు. జట్టు కెప్టెన్‌గా వారిని నేను పూర్తిగా నమ్ముతున్నాను.” అని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.