Reading Time: < 1 minute

ఎల్ నినోతో భవిష్యత్‎లో తీవ్ర సంక్షోభం.. కొవిడ్ తరహాలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తం: సీఎం రేవంత్

Caption of Image.

హైదరాబాద్: ఎల్ నినోపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినోతో భవిష్యత్‎లో తీవ్ర సంక్షోభం పొంచి ఉందని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కొవిడ్ తరహాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై శనివారం (అక్టోబర్ 10)  ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యచరణపై అధికారులతో చర్చించారు.

 ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల భవిష్యత్‏లో తీవ్ర సంక్షోభం ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. వచ్చే జూన్ వరకు సాగు, తాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‎లో విద్యుత్ అందుబాటులో లేదని.. అందుబాటులో ఉన్న విద్యుత్‎ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

విద్యుత్ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేస్తే మంచిదని అధికారులకు సూచించారు. ప్రతీ కార్యచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని.. ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సినిమా, మీడియా, వివిధ మాధ్యమాల ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయ వరకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని.. చుక్కా నీరు కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

 

©️ VIL Media Pvt Ltd.