Reading Time: < 1 minute
Cjp To March To Jantar Mantar Again Demands Cec Gyanesh Kumars Resignation

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగబోదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) స్పష్టం చేసింది. శనివారం ఢిల్లీలో ఆంక్షలు విధించి సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమ బాధ్యతలు తీసుకున్న అజింక్య షిండే ఈ విషయాన్ని వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను విత్ డ్రా చేసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, ఆదివారం కూడా జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. సీజేపీతో పాటు లెఫ్ట్ పార్టీల విద్యార్థి యూనియన్ల నిరసనలకు పిలుపునివ్వడంతో భద్రత కొనసాగించనున్నట్లు పోలీస్ వర్గాలు చెప్పాయి. శనివారం నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన 2000లకు పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.