Reading Time: < 1 minute

Vijay Deverakonda: సామాన్యులకు రౌడీ స్టార్ గుడ్ న్యూస్.. ‘రణబాలి’ సహా భవిష్యత్ సినిమాలకూ నో ప్రైస్ హైక్!

Caption of Image.

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా సామాన్యులకు అదిరిపోయే తీపి కబురు అందించారు. రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న థియేటర్ టికెట్ల ధరల వల్ల సామాన్య జనం థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్న తరుణంలో.. విజయ్ ఒక అత్యంత సాహసోపేతమైన, సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇకపై తాను నటించే ఏ సినిమాకూ టికెట్ ధరల పెంపు (Ticket Price Hikes) ఉండదని కుండబద్దలు కొట్టారు. “నా సినిమాలకు టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదు. ఒకవేళ సినిమా బడ్జెట్ భారీగా పెరిగితే.. నిర్మాతతో మాట్లాడి నా రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధమే. కానీ ప్రేక్షకులపై భారం వేయనని విజయ్ స్పష్టం చేశారు. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన మెలిక కూడా పెట్టారు రౌడీ బాయ్. మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్.ఎస్. రాజమౌళితో గనుక సినిమా చేసే అవకాశం వస్తే.. ఆ ఒక్క చిత్రానికి మాత్రమే మినహాయింపు ఉంటుందని, మిగతా అన్ని సినిమాలకూ సాధారణ ధరలే వర్తిస్తాయని నవ్వుతూ వెల్లడించారు.

రౌడీ హీరో తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయం పట్ల సినీ అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న మైండ్ బ్లోయింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబలి’. మైత్రి మూవీ మేకర్స్, టి-సిరీస్ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, అజయ్-అతుల్ అందించిన మ్యూజిక్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బిగ్ బడ్జెట్ సినిమా అయినప్పటికీ సాధారణ టికెట్ ధరలకే అందుబాటులోకి తెస్తుండటంతో, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచేందుకు సిద్ధమైన ‘రణబలి’ అక్టోబర్ 16న ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..
 

 

©️ VIL Media Pvt Ltd.