
ఈ నెల ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ తగ్గుతూ ఉన్న బంగారం ధరలు చివరికి ఊరటను కలిగిస్తున్నాయి. ఒకానొక సమయంలో గ్రాము రూ.16వేల దగ్గరలోకి చేరుకున్న బంగారం ఇంకా పెరుగుదుందని ప్రజలు భయపడ్డారు. అయితే సోమవారం రోజున బంగారంతో పాటు వెండి ఒక్కసారిగా తగ్గటంతో బులియన్ మార్కెట్లపై కొనుగోలుదారుల చూపు పడింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయటానికి ముందుగా తమ నగరాల్లోని రిటైల్ రేట్లు ఎంత తగ్గాయో తెలుసుకోవటం చాలా ముఖ్యం.
సెప్టెంబర్ 28న బంగారం రేట్లు ఊహించనంతగా తగ్గాయి. సెప్టెంబర్ 27 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.251 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 017గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 765గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 28, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.