Reading Time: 2 minutes
నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నప్పటికీ.. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్ కయాదు లోహార్ పాత్రకు సంబంధించి రకరకాల కామెంట్స్ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలైన వెంటనే కయాదు లోహార్ పాత్రకు సంబంధించిన కొన్ని విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కథలో భాగంగా ఆ పాత్ర తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని, తండ్రి మరణం తర్వాత మిగిలిపోయిన అప్పులను తీర్చేందుకు బీ-గ్రేడ్ వీడియోల్లో నటించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అయితే ఈ సన్నివేశాన్ని తెరకెక్కించిన విధానం కొంతమంది ప్రేక్షకులకు అసౌకర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కూతురు అలాంటి పరిస్థితిలో నటిస్తుండగా తల్లి స్వయంగా ఆ వీడియోను రికార్డ్ చేయడం, అలాగే ఆమె నటనను ప్రశంసిస్తూ చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్స్ మీమ్స్ వైరల్ అయ్యాయి.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

కూతురి పరిస్థితిని తల్లి అలా ఎలా చూస్తోంది.? ఆ సన్నివేశం ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు.? కుటుంబ బంధాన్ని చూపించాల్సిన సన్నివేశంలో ఇలాంటి చిత్రీకరణ ఎందుకు అవసరమైంది.? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్దెత్తున కామెంట్స్ చేస్తున్నారు. వివాదం పెరగడంతో హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సన్నివేశం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కనిపించిన సన్నివేశాన్ని మాత్రమే కాకుండా, ఆ పాత్రల మధ్య గతంలో జరిగిన సంఘటనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దర్శకుడు శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే

కయాదు పాత్ర చిన్నతనంలోనే హీరోయిన్ కావాలనే కలతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నటనలో ఆమెకు భవిష్యత్తు లేదని, చివరకు ఓడిపోయి తిరిగి ఇంటికే వస్తావంటూ అప్పట్లో తల్లి కూతురిని నిరుత్సాహపరుస్తుంది. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. జీవితంలో ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అదే కూతురు తన నటన, ప్రతిభను ఊహించని రీతిలో ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో తల్లి తన కూతురిలో ఉన్న ప్రతిభను తొలిసారి గుర్తిస్తుంది. ఈ క్రమంలోనే నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వి అని ఆమె చెప్తుందని శ్రీకాంత్ వివరించాడు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిందని శ్రీకాంత్ ఓదెల అన్నారు. సినిమా రన్ టైమ్ తగ్గించే క్రమంలో కయాదు పాత్ర చిన్నతనానికి సంబంధించిన కొన్ని ఎస్టాబ్లిషింగ్ సన్నివేశాలను ఎడిటింగ్ సమయంలో తొలగించాల్సి వచ్చిందట. దీంతో తల్లి-కూతుళ్ల మధ్య గతంలో జరిగిన సంఘటనలు ప్రేక్షకులకు పూర్తిగా తెలియకుండా పోయాయని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చారు.

ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.