
పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ను వాయిదా వేసింది. క్యాంపస్ లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల క్రమంలో పది రోజుల పాటు తరగతులను నిలిపివేసినట్లు LPU యాజమాన్యం ప్రకటించింది.
సెప్టెంబర్ 28 నుంచి పదిరోజుల పాటు యూనివర్సిటీలో సాధారణ తరగతులు పదిరోజుల పాటు నిలిపివేశారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ ప్రటకన అమలులో ఉంటుంది. ఎగ్జామ్స్ షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు. విద్యార్థులు కోరుకుంటే పేరెంట్స్ తో సొంతూళ్లకు వెళ్లొచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
LPUలో ఏం జరిగింది?
విద్యార్థిపై అత్యాచారం, ఆతహ్మత్యాయత్నం జరిగిందని ఆరోపణలతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించలేదని క్యాంపస్ లో బీభత్సం సృష్టించారు. యూనివర్సిటి ముందు హైవేను దిగ్భంధించారు. శనివారం రాత్రి మొదలైన ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. దీంతో క్యాంపస్ లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు.అయితే విద్యార్థుల దాడుల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు. క్యాంపస్ లోని ఫర్నీచర్, కిటీకీలు ధ్వంసం చేసి తగలబెట్టారు.
ఇదిలా ఉంటే.. యూనివర్సిటీలో అత్యాచారం, ఆత్మహత్యాయత్నం కేవలం ఆరోపణలుమాత్రమేనని ఎల్పీయూ యాజమాన్యం కొట్టిపారేసింది. కొన్ని అసాంఘిక శక్తులు కావాలని ఈ దుష్ప్రచారం చేశాయని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక విచారణలో ఘటన మూడు రోజుల క్రితం జరిగినట్లు తేలింది. ఘటన తర్వాత విద్యార్థిని హాస్టల్ నుంచి ఇంటికి తిరిగివెళ్లిపోయనట్లు పోలీసులు తెలిపారు. ఎల్ పీయూ జీ 3 హాస్టల్ లో ఉంటున్న ఓ విద్యార్థినిపై మూడు రోజుల క్రితం అత్యాచారం జరిగిందని జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు.
బాధిత విద్యార్థిని వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పదిహేను రోజుల క్రితం క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ విద్యార్థి విషయాన్ని కూడా విద్యార్థులు లేవనెత్తారని ఆయన తెలిపారు. పోలీసులు విచారణ ప్రక్రియను ప్రారంభించారు.