Reading Time: < 1 minute
Love And War Continues To Be Plagued By Leaks

లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి హీరో హీరోయిన్ లుక్స్ ఇవ్వడంలో సంజయ్ లీలా భన్సాలీ లేట్ చేస్తున్నాడేమో కానీ లీక్ వీరులు మాత్రం చాలా ఫాస్ట్‌గానే ఉన్నారు. ఇప్పటికే రణబీర్, ఆలియా, విక్కీ కౌశల్ పిక్స్ బయటకు వచ్చి.. నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. విక్కీ అండ్ రణబీర్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్సుల్లో ఉన్న పిక్స్, ఆలియా రెట్రో స్టైల్ లుక్స్ లీకయ్యాయి. ఈ లీక్స్ ఎక్కువ కావడంతో దర్శకుడే హీరోల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాడు.

తాజాగా ఆలియా భట్ లుక్ రివీల్ చేశాడు సంజయ్ లీలా భన్సాలీ. పోస్టర్స్‌లో క్యాబరే డ్యాన్సర్ గా రెట్రో లుక్‌లో.. రెడ్ కలర్ సీక్విన్ ఔట్ ఫిట్‌లో మెస్మరైజ్ చేసింది ఆలియా. లవ్ అండ్ వార్ నుండి ఇలా ఫస్ట్ లుక్ వచ్చిందో లేదో కొన్ని గంటల్లోనే సాంగ్ మేకింగ్ వీడియో లీకైంది. ఇక ఆలియా డ్యాన్స్ మూమెంట్స్‌పై నెగిటివ్ కామెంట్స్ స్టార్టయ్యాయి. ఆలియా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. కియారా టాక్సిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సంజయ్ లీలా భన్సాలీ కాపీ కొట్టాడంటున్నారు నెటిజన్స్. గంగూభాయ్ కతియా వాడీ తర్వాత ఆలియా అండ్ సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ లవ్ అండ్ వార్. నెక్ట్స్ ఇయర్ జనవరి 21న రిలీజ్ కానుంది. గంగూ భాయ్ కతియా వాడీ ఇచ్చిన హిట్ తో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంది ఆలియా. కానీ జిగ్రా, ఆల్ఫా బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. దీంతో యూటర్న్ తీసుకుని గ్లామర్ గర్ల్‌గా మారింది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. కానీ కొన్ని సార్లు మిస్ ఫైర్ కూడా అయ్యాయి. మరి లవ్ అండ్ వార్.. రణబీర్, విక్కీ కౌశల్, ఆలియాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.