శాంతియుత నిరసనల్లో .. హింస నన్ను బాధించింది: సోనమ్ వాంగ్ చుక్

ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనల్లో హింస తలెత్తిన క్రమంలో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుగ్ యువతకు, విద్యార్థులకు ఓ మేసేజ్ చేశారు. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడం తనను బాధించాయని వాంగ్ చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. బయటినుంచి వచ్చిన వారు రెచ్చగొడతారు.. విద్యార్థులు, యువత సంయమనం పాటించాలని వాంగ్ చుక్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అహింసా మార్గాన్ని విడిచిపెట్టొదని సోనమ్ వాంగ్ చుక్ నిరసన కారులకు సూచించారు.
గురువారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా వాంగ్ చుక్ ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ‘‘ శాంతి.. శాంతియే నామార్గం.. జంతర్ మంతర్ లో జరుగుతున్న నిరసనలు శాంతి యుతంగా కొనసాగుతున్నాయి. అయితే ఇతర ప్రాంతాల్లో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఈ శాంతియుత నిరసనలను అవకాశంగా తీసుకొను హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.. నాకు చాలా బాధగా ఉంది.. ఎదురువారు ఎలా ప్రవర్తించినా.. మన స్పందన మాత్రం ఎప్పుడు శాంతియుతంగానే ఉండాలి.. హింసకు హింసతో కాదు ప్రేమతో , సహనంతో సమాధానం చెప్పాలి అని సోనమ్ పోస్ట్ లో యువతకు సూచించారు.