July 23, 2026

Weather Report: తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

Weather Report: తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
Reading Time: < 1 minute
Weather Report: తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

తెలంగాణ వాసులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేసింది. సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, దామోహ్, డాల్టన్‌గంజ్, కాంటాయ్ గుండా ప్రయాణిస్తూ, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కొనసాగుతోందని.. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉందని… నిన్న 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న విండ్ షియర్ మరింత ఉత్తరం వైపును కదిలిందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకావం ఉందని తెలిపింది.

రాబోవు 3 రోజులకు వాతావరణం ఇదే..

గురువారం వాతావరణం: ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని.. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం వాతావరణం: రాష్ట్రంలో శుక్రవారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం వాతావరణం: శనివారం కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

అధికారుల సూచనలు: ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద కాని, విద్యుత్ స్థంభాల కింద కాని ఉండకూదని స్పష్టం చేసింది. అలాగే రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు ముందు వెనక చూడాలని.. ఎక్కడైనా విద్యుత్ స్థంభాలు విరిగి పడిలే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.