Reading Time: < 1 minute

ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి దారుణం : ధర్మసమాజ్ పార్టీ నేత లక్ష్మణ్

Caption of Image.

నేరడిగొండ, వెలుగు: ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయించడం దారుణమని, ఇది హేయనీయమైన దుశ్చర్య అని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, ఆడపిల్లలను చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో తొలిసారిగా విద్యావ్యవస్థ పరిరక్షణ కోసం ఇంత బలమైన పోరాటం జరుగుతుంటే, దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతి, లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.