July 23, 2026

రేయ్.. ఏంట్రా ఇలా ఉన్నారు.. బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..

రేయ్.. ఏంట్రా ఇలా ఉన్నారు.. బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
Reading Time: < 1 minute
రేయ్.. ఏంట్రా ఇలా ఉన్నారు.. బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..

ఫేక్ ఫోన్ ఫే స్క్రీన్ షాట్‌తో డబ్బులు చెల్లించినట్లుగా చూపించి బంగారు ఆభరణాలుతో నిందితుడు జంప్ అయ్యాడు.. ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో చోటుచేసుకుంది. ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి ఓ కేటుగాడు బంగారు నగలు కాజేయడం సంచలనంగా మారింది. చేతన్ జ్యువెలరీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని చేతన్ జ్యువెలరీకి వచ్చిన ఓ వ్యక్తి ఉంగరం, లాకెట్ చూపించాలన్నారు.. అనంతరం పరిశీలించిన.. వాటిని ఎంపిక చేసుకున్నాడు.

అనంతరం మొత్తం రూ.1.05 లక్షలు అవుతాయని చెప్పగా బేరం ఆడి రూ.97 వేలకు ఒప్పించాడు. ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానంటూ బిల్లు రాయించుకున్న అతడు, ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి డబ్బులు పంపినట్లు నమ్మించాడు. నగలు దుకాణంలో ఇతర కస్టమర్స్ ఉండటంతో వారితో బిజీగా ఉన్న షాపు యాజమాని ..ఆ తర్వాత అకౌంట్ చెక్
చేయగా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ఖాతాలో నగదు జమ కాలేదని దుకాణ యజమానురాలు చెప్పేలోపే బంగారు నగలతో ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. యజమానురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు కొత్తగూడెం వైపు తప్పించుకున్నట్లు స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు నిందితుడు మండలంలోని పలువురు బంగారు దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు కూడా సీసీ కెమెరాల్లో నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..