July 23, 2026

ములుగులో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్

ములుగులో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్
Reading Time: < 1 minute

ములుగులో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్

Caption of Image.

ములుగు, వెలుగు : ములుగులోని సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆఫీసర్లు ప్రతిపాదనలను కలెక్టర్ బోర్ఖడే హేమంత్​ సహదేవరావు ముందు ఉంచారు. బుధవారం ములుగు కలెక్టరేట్​లో హైదరాబాద్ లోని  బీబీనగర్ ఎయిమ్స్ డీన్ రిసెర్చ్ డా.రాహుల్ నరాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలెక్టర్ ను కలిశారు.  

ఈ సందర్భంగా బృందం సభ్యులు ప్రతిపాదిత కేంద్రం లక్ష్యాలు, గిరిజన ఆరోగ్య సేవల బలోపేతం, వైద్య పరిశోధనలు, అకడమిక్ సహకారం, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యరంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ వైఎల్.శ్రీనివాస్​, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో డాక్టర్​ గోపాల్​రావు, ములుగు, ఏటూరునాగారం ఆసుపత్రుల సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సురేష్, ఎయిమ్స్ వైద్య బృందం సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.