July 23, 2026

Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్‌లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!

Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్‌లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
Reading Time: 2 minutes
Kalyani Priyadarshan In Talks To Star Opposite Ranveer Singh Pralay Movie

Kalyani Priyadarshan: బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, పీరియడ్ డ్రామాల తర్వాత ఇప్పుడు జాంబీ థ్రిల్లర్ జానర్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో భిన్నమైన ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న రాబోయే జాంబీ థ్రిల్లర్ ‘ప్రళయ్’ ఇప్పటికే ఇండస్ట్రీలో  హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ‘దురంధర్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో ఈ కొత్త ప్రయోగంలో ఎలా కనిపించబోతున్నారనేది ఆసక్తిగా మారంది. సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే తారాగణం గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో కూడా మూవీపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ముఖ్యంగా కథానాయిక పాత్ర కోసం దక్షిణాది నటి కళ్యాణి ప్రియదర్శన్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

ఈ మూవీకి దర్శకుడు జై మెహతా దర్శకత్వం వహించనుండగా, త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. జాంబీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో పాటు బలమైన కంటెంట్ కూడా ఉంటుందని మేకర్స్  చెబుతున్నాయి. అందుకే ప్రతి పాత్రకు సరిపోయే నటీనటులను ఎంపిక చేయడంపై చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘లోక’ చిత్రంలో సూపర్ హీరో పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమాలో ఆమె చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అదే కారణంగా ‘ప్రళయ్’లోనూ బలమైన మహిళా పాత్ర కోసం ఆమె పేరును పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ఖరారైతే కళ్యాణి ప్రియదర్శన్‌కు ఇది బాలీవుడ్‌లో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు హిందీ చిత్రసీమలో కూడా అడుగుపెడితే కెరీర్‌కు కొత్త దిశ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోతో తొలిసారి జతకట్టే అవకాశం రావడం కూడా ఆమె కెరీర్ కు కీలక మలుపుగా మారనుంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి కళ్యాణి ప్రియదర్శన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రణవీర్ సింగ్ అభిమానులతో పాటు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ నిజమవుతుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.