July 23, 2026

Priyanka Chopra: ‘నన్ను కావాలనే సినిమాల నుంచి తప్పించారు’.. బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు!

Priyanka Chopra: 'నన్ను కావాలనే సినిమాల నుంచి తప్పించారు'.. బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు!
Reading Time: 2 minutes

Priyanka Chopra: ‘నన్ను కావాలనే సినిమాల నుంచి తప్పించారు’.. బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు!

Caption of Image.

ఒకప్పుడు బాలీవుడ్‌లో వరుస హిట్‌లతో స్టార్‌డమ్‌ను ఆస్వాదించిన ప్రియాంకా చోప్రా.. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఆమె బాలీవుడ్‌ను ఎందుకు వదిలేశారో అన్న ప్రశ్నకు లేటెస్ట్ గా సమాధానం ఇచ్చింది. అవకాశాలు ప్రతిభ ఆధారంగా కాకుండా కొందరి ఇష్టానుసారంగా మారాయని చెప్పింది. స్టార్ హీరోల ఒత్తిళ్ల వల్ల తనకు రావాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.. 

అగ్ర హీరోల ఒత్తిళ్ల వల్లే..

2007లో ‘సలామ్-ఎ-ఇష్క్’ చిత్రీకరణ సమయంలో ఓ స్టార్ హీరో తనను ప్రత్యేకంగా కలిసి.. ఈ సినిమా నుంచి తప్పిస్తున్నారని చెప్పారని ప్రియాంక తెలిపింది. దర్శకుడు పొరపాటున ఈ సినిమాలో  నీకు అవకాశం ఇచ్చారు. అసలు ఈ పాత్ర మరో హీరోయిన్ చేయాల్సింది అని చెప్పడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వెల్లడించారు. ఇలాంటి సంఘటన ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ఎదురయ్యాయని, కానీ రాజీపడకుండా తన నటనపైనే దృష్టి పెట్టి ముందుకు సాగానని చెప్పారు. అదే నిర్ణయం తనను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు.

అపరిచితుడినే..

ఇక ప్రియాంక చురుకైన సమాధానాలకు అభిమానులు ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. ‘ది జెన్నిఫర్ హడ్సన్ షో’లో ‘‘సాయం కోసం మాజీ ప్రియుడిని అడుగుతావా? లేక అపరిచితుడిని?అనే ప్రశ్నకు క్షణం ఆలస్యం చేయకుండా ‘అపరిచితుడినే’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంటనే నేను నా పుస్తకాన్ని వెనుక నుంచి చదవను. తర్వాతి అధ్యాయానికి వెళ్తాను, పాత కథకు కాదు అని చెప్పడంతో స్టూడియో మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మిలియన్ల వ్యూస్ సాధించింది. అభిమానులు మిస్ వరల్డ్ కిరీటం ఎందుకు గెలిచిందో ఈ ఒక్క సమాధానమే చెబుతోంది అంటూ ప్రశంసలు కురిపించారు.

►ALSO READ | తిరుమలలో ‘పెద్ది’ పోస్టర్ కలకలం.. భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం

వారణాసితో రెడీ..

2018లో అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది ప్రియాంక.2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీ మేరీకి తల్లయ్యారు. ప్రస్తుతం మహేశ్ బాబు,రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’లో ప్రియాకం నటిస్తుంది. ఈ సినిమాతో మరోసారి భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఆమె సాగించిన ప్రయాణం, ఎదురుదెబ్బలను అవకాశాలుగా మలుచుకున్న తీరు పై అభిమానులు ప్రశంసిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj (@thisisme__aditya)

 

©️ VIL Media Pvt Ltd.