Reading Time: < 1 minute

పరవళ్లు తొక్కుతున్న గుండాల జలపాతం.. 150 అడుగుల ఎత్తు నుంచి దుముకుతున్న జలధారలు

Caption of Image.

తెలంగాణ కాశ్మీర్‌గా పేరుగాంచిన కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రకృతి మాత పరవళ్లు తొక్కుతోంది.  జిల్లాలోని తిర్యాని మండలం గుండాల జలపాతం ఇప్పుడు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండకోనలు పచ్చదనాన్ని పరుచుకోగా, గుండాల జలపాతం నిండు కుండలా మారి ఉధృతంగా ప్రవహిస్తోంది.

దాదాపు 150 అడుగుల ఎత్తైన కొండల మధ్య నుంచి మంచు ముత్యాల్లా దుముకుతున్న ఈ ‘బాహుబలి’ జలపాతం ఆకట్టుకుంటోంది. ఆకాశం నుంచే నేరుగా అమృత ధారలు నేలకొరిగేలా ఉన్న ఈ ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి.

►ALSO READ | తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. అదనపు ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న సందర్శకులు జలపాతాల అందాలను తిలకిస్తూ, కెమెరాల్లో బంధిస్తూ, సెల్ఫీలు, రీల్స్‌తో సందడి చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఇచ్చే ప్రశాంతత, ఆహ్లాదం అద్భుతమని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

 

©️ VIL Media Pvt Ltd.