వృందావన్ వెళ్లిన విరాట్– అనుష్క.. CJP నిరసనలపై మౌనంతో నెట్టింట రచ్చ!

Virat Kohli: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ వివాదంపై న్యాయం చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ బృందావనంలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
బృందావనంలో ప్రేమానంద్ జీ మహారాజ్ దర్శనం:
ఈరోజు (బుధవారం, జులై 22న) రోజున విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు బృందావన్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్ జీ మహారాజ్ దగ్గరకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ అత్యంత సాధారణ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్లడం ఈ ఫోటోల్లో కనిపిస్తోంది. విరాట్-అనుష్క జంట తరచూ ఈ ఆధ్యాత్మిక వేత్తను కలవడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి మాత్రం ఫ్యాన్స్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఢిల్లీ అల్లర్లపై నోరు విప్పవా.. కోహ్లీపై నెటిజన్ల పైర్:
ఢిల్లీలో విద్యార్థులపై దాడి జరుగుతుంటే, స్వయంగా ఢిల్లీలోనే పుట్టి పెరిగిన విరాట్ కోహ్లీ ఈ అంశంపై నోరు విప్పకపోవడం, కనీసం మద్దతు తెలుపకపోవడంపై నెటిజన్లు, ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అతడిపై మండిపడుతున్నారు. దేశం నీకు అంతా ఇచ్చింది, ప్రజలు నిన్ను దేవుడిలా ఆరాధిస్తున్నారు.. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆందోళన బాట పట్టిన విద్యార్థుల తరఫున నిలబడు అని ఒక నెటిజన్స్ పేర్కొన్నారు.
►ALSO READ | ఢిల్లీ నిరసనల వీడియో షేర్ చేసిన రితికా.. వైరల్ అవుతున్న రోహిత్ భార్య పోస్ట్!
రంగంలోకి దిగిన బాలీవుడ్ ప్రముఖులు:
విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా అనేక మంది సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. హుమా ఖురేషి, దిల్జీజ్ దోసాంజ్, రితీష్ దేష్‌ముఖ్, షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, ప్రీతి జింటా లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం నా హృదయం బాధతో బరువెక్కింది, మన పిల్లలపై జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతోంది. ముసుగులు ధరించి, చేతుల్లో కర్రలు పట్టుకున్న ఈ గూండాలు నాకు అమెరికాలోని ICE (ఇమిగ్రేషన్) ఏజెంట్లను గుర్తు చేస్తున్నారు. ఎవరైనా సరే.. మీ ఇంట్లోని పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి, మీరు చేస్తున్న ఈ అక్రమాలకు ఏదో ఒకరోజు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Virat Kohli And @AnushkaSharma Arrived In Vrindavan To Seek Blessings From Premanand Ji Maharaj. 🙏✨
.
.
.#Virushka @RadhaKeliKunj pic.twitter.com/MIGF1NifGR— virat_kohli_18_club (@KohliSensation) July 22, 2026
Virat Kohli & Anushka Sharma at Vrindavan for blessings from Premanand Ji Maharaj. 🙏🙏 pic.twitter.com/5lv4aYilIj
— Virat x Rohit (@KumarShail72293) July 22, 2026