Reading Time: < 1 minute
Thalapathy Vijay Anil Ravipudi Meeting Bhagavanth Kesari

Anil Ravipudi: తమిళ స్టార్ హీరో విజయ్‌తో జరిగిన ఓ ప్రత్యేకమైన మీటింగ్ గురించి టాలీవుడ్ హిట్‌మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనల్లో విజయ్ గారిని కలవడం కూడా ఒకటని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ నటించిన ‘ది GOAT’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న సమయంలో తనకు ఊహించని విధంగా దళపతి విజయ్ నుంచి పిలుపు వచ్చిందన్నారు. అప్పటికే విజయ్ తన డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని చూసినట్లు తెలిసిందని, వెంటనే ఆయనను కలవడానికి షూటింగ్ లొకేషన్‌కు వెళ్లినట్లు వెల్లడించారు.

కారవాన్‌లో సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఆ మీటింగ్‌లో విజయ్ తనను అభినందించిన విధానం ఎప్పటికీ మర్చిపోలేనిదని అనిల్ రావిపూడి తెలిపారు. “నేను భగవంత్ కేసరి సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. మీరు చాలా బాగా తెరకెక్కించారు. సినిమాలోని కొన్ని ఎపిసోడ్లు ఇప్పటికీ నా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి అభినందించాలనిపించింది” అని విజయ్ తనతో చెప్పారని అనిల్ వెల్లడించారు. విజయ్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఆ భేటీ ముగిసిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫోన్ చేసి ఈ విషయాన్ని పంచుకున్నానని ఆయన వెల్లడించారు. అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.