July 23, 2026

నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం

నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం
Reading Time: < 1 minute

నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం

Caption of Image.

నాగర్ కర్నూల్ టౌన్/కోడేరు,(పెద్దకొత్తపల్లి), వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఒక మహిళకు ముగ్గురు శిశువులు జన్మించినట్లు డాక్టర్ నూర్జహాన్ తెలిపారు. 

పెద్ద కొత్తపల్లి మండలం నారాయణ పల్లి గ్రామానికి చెందిన అనిత మొదటి కాన్పు కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చింది. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించగా, మంగళవారం సాధారణ ప్రసవం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. 

ముగ్గురు పిల్లల బరువు రెండు కిలోల చొప్పున ఉన్నారని, ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్​ తెలిపారు. సాధారణ కాన్పులో ముగ్గురు జన్మించడంతో తల్లిదండ్రులు  సంతోషం వ్యక్తం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.