Reading Time: < 1 minute
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగరిపడుతున్న మంటలు! పలువురికి గాయాలు

వైజాగ్‌, జూన్‌ 8: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం (జూన్ 8) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలుకాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పుతుంది. ఎస్ఎంఎస్ 1 లో భారీ పేలుడు సంభవించింది. CCD ( కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్) విభాగంలో భారీగా మంటలు చాల రేగుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో పలువురు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఉద్యోగులను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు లాడెల్ నుంచి ద్రవ ఉక్కు బయటకు వచ్చి నేలపాలైంది.

భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి భారీ క్రేన్ దగ్ధమైంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతుంది. ప్రమాద స్థలంలో మొత్తం 16 మంది వరకు ఉన్నట్లు సమాచారం. CCD విభాగంలోనే 8 మంది ఉన్నారు. SMS 1లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.