Reading Time: < 1 minute
How To Get Rid Of Ants In Kitchen Naturally Dettol Hing Spray Diy

Kitchen Hacks: కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లు, సింక్ ఏరియాలు లేదా తీపి పదార్థాల డబ్బాల చుట్టూ చీమలదండు చేరడం సాధారణ సమస్య. ఒక్కోసారి ఇవి ఆహార పదార్థాల్లోకి దూరి వాటిని పాడు చేయడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ముప్పుగా మారుతుంటాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్ చాక్‌లు, స్ప్రేలను వాడటం వల్ల ఆహార పదార్థాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కెమికల్స్ లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన స్ప్రే ఉంది. దానిని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నాచురల్ స్ప్రేకు కావలసిన పదార్థాలు

ఒక ఖాళీ స్ప్రే బాటిల్

డెటాల్ (Dettol) – 2 చెంచాలు

ఇంగువ పొడి (Asafoetida) – 1 చెంచా

తయారీ విధానం..

ముందుగా ఒక ఖాళీ స్ప్రే బాటిల్ తీసుకుని, అందులో రెండు చెంచాల డెటాల్ లిక్విడ్‌ను పోయాలి. ఆ తర్వాత అందులో ఒక చెంచా మెత్తని ఇంగువ పొడిని కలపాలి (ఒకవేళ ఇంట్లో పల్కల ఇంగువ ఉంటే దాన్ని దంచి పొడిగా చేసుకోవచ్చు). ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి బాటిల్‌ను బాగా షేక్ (కలపాలి) చేయాలి. ఇంగువ – డెటాల్ నుంచి వచ్చే ఘాటైన వాసన చీమలకు అస్సలు పడదు. కిచెన్, సింక్ కింద, తీపి డబ్బాల చుట్టూ లేదా ఇంట్లో చీమలు తిరిగే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేస్తే చాలు.. చీమలకు ఎలాంటి హాని కలగకుండానే అవి ఆ ప్రాంతం నుంచి శాశ్వతంగా పారిపోతాయి. కెమికల్స్ వాడకుండా ఇల్లాళ్లకు వంటింటిని హైజీన్‌గా ఉంచుకోవడానికి ఇదొక బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా పని చేస్తుందని చెబుతున్నారు.