
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వాచ్ దొంగిలించడానికి ఓ పిల్లాడు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోహిత్ తన కారులో కూర్చుని ఉండగా.. అభిమానులు కారు చుట్టూ గుమిగూడారు. అభిమానులను చూసి రోహిత్ కారు అద్దం బయట చేతులు ఉంచి హాయ్ చెబుతున్నాడు.
ఇంతలో.. ఇద్దరు పిల్లలు రోహిత్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. వీళ్లలో ఒక పిల్లాడు అయితే.. ఏకంగా రోహిత్ శర్మ చేతికి ఉన్న వాచ్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. రోహిత్ శర్మ వెంటనే చేతిని లోపలికి తీసుకున్నాడు. ఆ పిల్లాడికి వేలు చూపించి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించాడు.
Rohit Sharma Fans tried to snatch his 3.25 Cr “Giraffe” watch from his wrist. And suddenly he close the mirror. pic.twitter.com/vMIQFxcdxt
— Aman (@Proteinkohli) May 8, 2026
ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినప్పటికీ ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటన సెలబ్రిటీలు అభిమానుల మధ్యకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందో చెప్పకనే చెప్పింది. రోహిత్ శర్మ చేతికి ఉన్న ఆ వాచ్ రోలెక్స్ “జిరాఫ్”.. ఈ వాచ్ విలువ సుమారు రూ. 3.25 కోట్ల దాకా ఉంది. అంత కాస్టీ వాచ్ కొట్టేయడానికి తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లాడు ప్రయత్నించడం కలకలం రేపింది. చిన్నారులను బాధ్యతగా పెంచకపోతే ఎలా తయారవుతారో ఈ ఘటన కళ్లకు కట్టింది.