Reading Time: < 1 minute

తమిళనాట మరో ట్విస్ట్.. అన్నాడీఎంకే కూటమికి అవకాశం కల్పించాలని AMMK గవర్నర్కు లేఖ

Caption of Image.

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశం ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీకి అప్పుడే మద్ధతిస్తున్నట్లు.. అంతలోనే లేదన్నట్లు పార్టీలు దోబూచులాడుతున్నాయి. దీంతో మే 9 తేదీన చేయాల్సిన ప్రమాణ స్వీకారంపై పెద్ద సస్పెన్స్ ఏర్పడింది. ఇప్పటికీ మద్ధతు ఉపసంహరించుకున్నట్లు IMUL ప్రకటించగా.. VCK పార్టీ నుంచి గవర్నర్ కు లేఖ అందలేదు. ఇదిలా ఉండగా AMMK విజయ్ కి మరో షాక్ ఇచ్చింది. 

ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకేను ఆహ్వానించాలని AMMK గవర్నర్ కు లేఖ రాయడం సంచలనంగా మారింది.  బల నిరూపణ కోసం పిలవాలని AMMK గవర్నర్ కు లేఖ రాసింది. ఆ పార్టీ చీఫ్ దినకరణ్ స్వయంగా గవర్నర్ ను కలిసి లేఖ ఇచ్చారు. పళనిస్వామి నేతృత్వంలోని కూటమికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని లేఖలో కోరారు.

టీవీకేకు AMMK మద్ధతు ఇవ్వడం లేదన్న దినకరన్ ఈ సందర్భంగా తెలిపారు. మెజరిటీ కోసం విజయ్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని.. ఎమ్మెల్యేలతో విజయ్ బేరసారాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు  అంశంపై గవర్నర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.