Reading Time: < 1 minute

గవర్నర్ తీరును నిరసిస్తూ..లోక్ భవన్ ముందు TVK కార్యకర్తల ఆందోళన

Caption of Image.

తమిళనాడు పాలిటిక్స్ ఊహించని పరిణామాలతో ఆసక్తిని రేపుతున్నాయి. విజయ్ ను ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసే విషయంలో  గవర్నర్  రాజేంద్ర ఆర్లేకర్ తీరును నిరసిస్తూ టీవీకే మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు.108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ  ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ చీఫ్ విజయ్ చేస్తున్నా ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం  ఏర్పాటు చేస్తాం.. అనుమతివ్వండి అంటూ  రెండుసార్లు గవర్నర్ ను కలిసినా తిరస్కరించారు. ఫలితాలు వచ్చి నాలుగు రోజులు దాటినా ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు పై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు విజయ్ కి మద్దుతు భారీగా పెరుగుతోంది. విజయ్ నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కుడా మద్దతు తెలుపుతున్నారు. ఈక్రమంలో గవర్నర్ తీరుపై టీవీకే పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం (మే8) లోక్ భవన్ ముందు ఆందోళనలు చేశారు. ప్లకార్టులు పట్టుకొని నిరసన తెలిపారు.  నిరసన కారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలా ఉంటే.. తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.. విజయ్ ని కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే అన్నాడీఎంకే పార్టీలు చేతులు కలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ ఉనికిని కాపాడుకునేందుకు రెండు కలిసి పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ALSO READ : తమిళనాడు సీఎం రజినీకాంత్..?

మరోవైప మాజీ సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎం గా కాకుండా.. తమిళ సీనియర్ సినీనటులు రజనీకాంత్ ను సీఎం ను చేస్తానంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. స్టాలిన్ ప్రకటనతో తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.  

©️ VIL Media Pvt Ltd.