Reading Time: 2 minutes

తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. హైదరాబాద్లో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం

Caption of Image.

హైదరాబాద్: తమిళ రాజకీయాల్లో రోజురోజుకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ రాజకీయాలు తెలంగాణకు చేరాయి. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా నెలకొన్న తరుణంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. రాజకీయ సంక్షోభం ముగిసే వరకు శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లోనే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేయనున్నట్లు తెలిసింది.

తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్​ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ సినిమాను తలపిస్తున్న సంగతి తెలిసిందే. ట్విస్ట్ల మీద ట్విస్ట్‌‌‌‌లతో గంట గంటకూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకున్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

మ్యాజిక్‌‌‌‌ ఫిగర్‌‌‌‌కు కేవలం రెండు అడుగుల దూరంలో టీవీకే కూటమి నిలిచిపోవడంతో, శనివారం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌‌‌‌‌‌‌‌ను‌‌‌‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరిన విజయ్‌‌‌‌కి చుక్కెదురు కాగా.. మూడోసారి కూడా నిరాశే మిగిలింది. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంల్‌‌‌‌లాంటి పార్టీలతో సుదీర్ఘ మంతనాల తర్వాత ఆ పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించగా.. వారు ఇచ్చిన లేఖలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌‌‌‌ను విజయ్‌‌‌‌ నేతృత్వంలో టీవీకే నేతలు కలిశారు.

ఈ క్రమంలోనే తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖలు అందించగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో శనివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో.. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఇంతలోనే మరో హైడ్రామా నెలకొంది. వీసీకే పార్టీ అధికారికంగా లేఖ ఇవ్వలేదని.. ఇతర పార్టీలు మద్దతు ఉపసంహంరించుకున్నాయని.. అందుకే లోక్‌‌భవన్‌‌ నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదని తెలిసింది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108  స్థానాలు (విజయ్‌‌ రెండు చోట్ల) గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజార్టీ మార్క్‌‌ (118)కు 11 స్థానాల దూరంలో ఆగిపోయింది. తొలుత టీవీకేకు కాంగ్రెస్‌‌ (5 స్థానాలు) మద్దతు ప్రకటించింది. శుక్రవారం విజయ్‌‌ నేతృత్వంలో సుదీర్ఘ చర్చల తర్వాత సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే, ఇతర పార్టీలు మద్దతు ప్రకటించడంతో మెజార్టీ మార్కును చేరుకున్నట్లయింది. దీంతో 120 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉన్నట్టు గవర్నర్‌‌‌‌కు విజయ్‌‌ లేఖ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.