Reading Time: < 1 minute

మహబూబాబాద్ జిల్లా పొగుళ్ళపల్లిలో హై టెన్షన్… అటవీశాఖ ఫెన్సింగ్ పనులు అడ్డుకున్న గ్రామస్తులు..

Caption of Image.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్ళపల్లిలో హై టెన్షన్ నెలకొంది. అటవీశాఖ ఫెన్సింగ్ పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఫెన్సింగ్ పనుల కోసం వచ్చిన అధికారులను, పోలీసులను అడ్డుకొని నిలదీశారు గ్రామస్తులు. ఈ క్రమంలో పోగుళ్లపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీస్ వాహనాలను, గ్రామస్తులు, గిరిజనులు చుట్టుముట్టారు. 

హైద్రాబాద్ రీజినల్ రింగ్ రోడ్  (RRR)  నిర్మాణంలో అటవీశాఖ భూమిని కోల్పోవడంతో  దానికి బదులుగా ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్ళపల్లి గ్రామ శివారులోని 73.1 ఎకరాల రెవెన్యూ భూమిని ఆటవీశాఖ కు బదలాయించింది..

ఈ భూమిలో తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. భూమిని కాపాడుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు గిరిజనులు.కోర్టు తీర్పు వచ్చేవరకు పనులు చేయవద్దు అని ఆధికారులతో వాగ్వివాదానికి దిగారు గిరిజనులు. ప్రాణాలు పోయిన ఫర్వలేదు కానీ.. భూములను మాత్రం వదులుకొమని అంటున్నారు పొగుళ్ళపల్లి గ్రామస్తులు.

©️ VIL Media Pvt Ltd.