
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న సందేహాలపై స్పష్టత ఇస్తూ తమిళనాడు గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. ప్రభుత్వ ఏర్పాటు విషయమై జోసెఫ్ విజయ్ని చెన్నైలోని లోక్ భవన్కు గురువారం ఆహ్వానించినట్లు గవర్నర్ కార్యాలయం ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మెజారిటీ సభ్యుల మద్దతు సమకూరలేదని గవర్నర్ విజయ్కి వివరించారని తమిళనాడు గవర్నర్ కార్యాలయం తెలిపింది.
Rajendra Vishwanath Arlekar, Governor of Tamil Nadu, has invited Thiru C. Joseph Vijay, President, Tamilaga Vettri Kazhagam, today to Lok Bhavan, Chennai. During the meeting, the Governor explained that the requisite majority support in the Tamil Nadu Legislative Assembly,… pic.twitter.com/57NboyBnWV
— ANI (@ANI) May 7, 2026
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్‌కి గవర్నర్ బుధవారం కూడా ఆహ్వానం పంపారు. ఆయనకు పంపిన ఆహ్వాన ప్రకటనను లోక్‌భవన్ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను విజయ్ కలుసుకున్నారు.
కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, పలు పార్టీలుకూడా తమతో చేతులు కలుపనున్నాయని గవర్నర్‌కు వివరించి చెప్పారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటానని తెలిపారు. అయితే, టీవీకే చీఫ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం తప్పనిసరి. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ సభ్యులను కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై ఉత్కంఠ నెలకొన్నది.