Reading Time: 2 minutes
Garuda Purana Death Signs Hindu Beliefs Life After Death

Garuda Purana: హిందూ సంప్రదాయంలో గరుడ పురాణాన్ని ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు. ఈ పురణం జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం, పాపాలు, పుణ్యాలు, కర్మల పర్యవసానాల గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి తన కర్మల పర్యవసానాలను ఈ జీవితంలోనే కాకుండా మరణానంతరం కూడా అనుభవిస్తాడని వివరిస్తుంది. అందుకే, ఒక వ్యక్తి మరణానంతరం, ఇంట్లో శాంతి నెలకొల్పడానికి, ఆత్మ సరైన మార్గంలో పయనించడానికి గరుడ పురాణాన్ని పఠిస్తారు. అయితే.. ఈ గ్రంథంలో ఓ కీలక అంశం ఉంది. మరణం అకస్మాత్తుగా రాదని ఈ గ్రంథం పేర్కొంటుంది. మరణానికి ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయట. జనాలు వాటిని సాధరణ విషయంగా తీసుకుని విస్మరిస్తారట. ఆ ఆరు సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: LPG Gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు

1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఏదైనా వ్యక్తికి మరణం దగ్గర పడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఏర్పాడుతాయి. శ్వాస ఒక్కోసారి చాలా వేగంగా, మరికొన్ని సార్లు చాలా నెమ్మదిగా మారుతుంది. ఈ సమయంలో కొంతమంది తమ మనస్సును చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి దూరం చేసి.. వేరే విషయాలపై కేంద్రీకరిస్తారట.

2. కలల్లో వింత దృశ్యాలు

కలలు మనకు రోజూ వస్తూనే ఉంటాయి. కానీ మరణం దగ్గర పడుతున్నప్పుడు వచ్చే కలలు వేరేగా ఉంటాయట. ఆరిపోయిన దీపం లేదా చీకటితో నిండిన దృశ్యాలు కలల్లో కనిపించడం.. జీవితం అనే జ్యోతి కొండెక్కిపోతుందనడానికి సూచనగా భావిస్తారు.

3. అరచేతి రేఖలు మసకబారడం
మరొక సంకేతం ఏమిటంటే.. మరణానికి కొన్ని రోజుల ముందు ఆ వ్యక్తి అరచేతిలోని గీతలు మసకబారడం లేదా అస్పష్టంగా కనిపించడం మొదలవుతాయట. ఇది జీవశక్తి క్షీణిస్తోందనడానికి సూచనగా పరిగణించబడుతుంది.

4. సొంత నీడ కనిపించకపోవడం
మరణం సమీపించినప్పుడు వ్యక్తికి నూనెలో గానీ లేదా నీటిలో గానీ తన ప్రతిబింబం (నీడ) స్పష్టంగా కనిపించదని ఒక నమ్మకం ఉంది. నీడ కూడా తోడు రాదు అనే అర్థంలో ఈ సంకేతాన్ని చెబుతుంటారు.

5. అదృశ్య శక్తులు కనిపించడం
చివరి క్షణాల్లో మనిషికి తన పూర్వీకులు లేదా కంటికి కనిపించని అదృశ్య శక్తులు దరిదాపుల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మ తన తర్వాతి ప్రయాణానికి సిద్ధమవుతోందని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా పరిగణించబడుతుంది.

6. ముక్కు కొన కనిపించకపోవడం
సాధారణ స్థితిలో మనం మన ముక్కును స్వల్పంగా చూడగలం. కానీ, అంత్యకాలం దగ్గర పడినప్పుడు వ్యక్తికి తన ముక్కు అస్సలు కనిపించదని ఒక ధారణ ఉంది. మృత్యువు దరిచేరితున్నపు ఇలా జరుగుతుందని గరుడ పురాణం చెబుతోంది.

గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు ఆధ్యాత్మిక విశ్వాసాలకు చెందినవి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన లక్షణాలుగా కాకుండా, సాంప్రదాయ విశ్వాసాలుగా మాత్రమే చూడాలి. నమ్మడం, నమ్మక పోవడం మీ వ్యక్తిగత విషయం.