Reading Time: < 1 minute
మహేష్ బాబు ఫ్యాన్ ఫైర్.. చిక్కుల్లో పడ్డ డైరెక్టర్  హరీష్ శంకర్

డైరెక్టర్ హరీష్ శంకర్ మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. తన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ట్విట్టర్ సెషన్‌లో ఈ వివాదం చెలరేగింది. ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ఉస్తాద్ భగత్ సింగ్ మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలంటూ ట్వీట్ చేశారు. దీనికి హరీష్ శంకర్ హడావిడిలో పూర్తిగా చదవకుండా “తథాస్తు” అని బదులిచ్చారు. ఈ ట్వీట్ మహేష్ బాబు అభిమానుల మధ్య తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.పరిస్థితిని గుర్తించిన హరీష్ శంకర్ నిమిషాల వ్యవధిలోనే ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ఒక వివరణతో కూడిన క్షమాపణ లేఖను విడుదల చేశారు. సినిమా విడుదల ఒత్తిడి, సెన్సార్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల వల్ల తొందరపాటులో ఈ పొరపాటు జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహేష్ బాబు పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని, గతంలో చేసిన ట్వీట్లే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. అలాగే, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న వారణాసి సినిమా మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట!

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!

మరణం సైతం విడదీయలేని మహా బంధం!

మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి