Reading Time: < 1 minute

హైకోర్టు సంచలన తీర్పు: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబా నిర్దోషిగా విడుదల..

Caption of Image.

జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే కింది కోర్టు ఇచ్చిన శిక్షను హైకోర్టు కొట్టివేసింది.

సమాచారం ప్రకారం… 2002 అక్టోబర్ 24న జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతిని తన ఇంటిలో కాల్చి చంపారు.  డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఆయన వార్తాపత్రిక  ఒక లెటర్ ప్రచురించారు. ఆ లెటర్  ప్రచురించిన  కొన్ని నెలలకే ఆయనపై హత్యా జరిగింది.

 2019లో సిబిఐ (CBI) ప్రత్యేక కోర్టు ఈ కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. దీనిని సవాలు చేస్తూ వారు హైకోర్టుకు వెళ్లారు. దింతో ప్రస్తుత తీర్పులో హైకోర్టు రామ్ రహీమ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారన్న ఆయన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

రామ్ రహీమ్  ఎక్కడ ఉన్నారంటే:
నిర్దోషిగా విడుదలైన  ఆయన జైలు నుండి బయటకు రారు. ఎందుకంటే  ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినందుకు ఆయనకు ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం హర్యానాలోని రోహ్‌తక్ జైలులో  శిక్ష అనుభవిస్తున్నారు. 2015 నాటి కొన్ని మతపరమైన వివాదాలకు సంబంధించిన కేసులు కూడా ఆయనపై విచారణలో ఉన్నాయి. మే 2024లో మరొక హత్య కేసులో కూడా హైకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

©️ VIL Media Pvt Ltd.