Reading Time: < 1 minute

కాలినడకన తిరుమల కొండపైకి చేరిన కవిత

Caption of Image.

పద్మారావునగర్‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్‌ రావడంతో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి నాయకులతో కలిసి కాలినడకన గురువారం సాయంత్రం తిరుమల కొండపైకి చేరుకున్నారు. శుక్రవారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.

లిక్కర్ కేసు నుంచి  నిర్దోషిగా బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు సేవలందించేలా ఆశీర్వదించాలని స్వామివారిని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు.  కవిత వెంట జాగృతి ఉపాధ్యక్షురాలు డాక్టర్ మంచాల వరలక్ష్మి, పలువులు మహిళా లీడర్లు ఉన్నారు.  
 

©️ VIL Media Pvt Ltd.