Reading Time: < 1 minute
Durandhar 2 Movie Runtime Controversy

గతంలో సంచలన విజయం నమోదు చేసిన ‘దురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘దురంధర్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, అయితే, ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ఈ సినిమా “నిడివి”, తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 4 గంటల ఫుటేజ్‌ను సెన్సార్‌ పరిశీలన కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా 2.5 గంటల నిడివి ఉంటేనే ప్రేక్షకుల సహనానికి పరీక్ష అని భావిస్తారు. కానీ, దర్శకుడు మాత్రం కథపై ఉన్న నమ్మకంతో నిడివి విషయంలో అస్సలు తగ్గడం లేదు.

Also Read :Geethu Royal: తిరుమలలో గీతూ ఓవరాక్షన్.. జీవితం కోల్పోయానంటూ రీల్!

ఈ సుదీర్ఘ నిడివిపై నిర్మాతలకు, దర్శకుడికి మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా సుమారు 3 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు వచ్చే అవకాశం ఉంది. అంత నిడివి ఉంటే థియేటర్లలో షోల సంఖ్య తగ్గుతుందని, ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడతారని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత వరకు ఎడిటింగ్ టేబుల్ దగ్గరే నిడివి తగ్గించాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు దర్శకుడు మాత్రం ‘ససేమిరా’ అంటున్నారు. కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ నిడివి తప్పనిసరి అని, ఒక్క నిమిషం కూడా తగ్గించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారట. సాధారణంగా సెన్సార్ బోర్డు సూచించే కట్స్, అలాగే ఫైనల్ ఎడిటింగ్ తర్వాత సినిమా నిడివి కొంత తగ్గే అవకాశం ఉంటుంది.