Reading Time: < 1 minute
Mohan Babu As Venkatappaya Naidu In Srinivasa Mangapuram Ajay Bhupathi

‘ఆర్ ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’.ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు, మరోసారి తన గంభీరమైన గొంతుతో, రాజసంతో థియేటర్లను దద్దరిల్లించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ మూవీలో మోహన్ బాబు పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేసింది.

Also Read; Ranabaali: రణబాలి.. నుండి విజయ్-రష్మికల ‘ఏందయ్యసామీ’ సాంగ్ వైరల్!

మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ (Venkatappaya Naidu) అనే పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ విడుదల చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే, ఆయన పాత్రలో పవర్‌ఫుల్ కారెక్టర్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. మోహన్ బాబు మార్క్ బాడీ లాంగ్వేజ్ ,డైలాగ్ డెలివరీకి అజయ్ భూపతి రాసుకున్న ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయం. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ , జెమిని కిరణ్ గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.