Reading Time: < 1 minute

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సిఎం డైరీని ఆవిష్కరించిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.